"ఏం చేస్తున్నావ్..ఏం చేస్తున్నావ్.." అనే ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియక...."నేనేం చేయాలి" అనే ప్రశ్న కు బదులుగా ..తిని తిరిగి తొంగోలేక...మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరింత దగ్గర అవ్వాలనే ఆలోచనతో తో చేస్తున్న ప్రయత్నమే ఈ బ్లాగ్..
రోజు..రోజు కి ...వీధి వీధి కి అభివృద్ధి ప్రోమో షాట్స్ వేస్తూ..development అనే రోడ్డు మీద clutch తొక్కి గేర్ ఏసిన తిరుపతి కి ....ఎప్పటికప్పుడు accelerator ఇస్తున్న తిరుపతి ప్రజలని..అధికారులని ..ప్రజానయకులని ..ముఖ్యంగా ట్రెండ్ ఫాలో అవుతూ ..క్రియేటివ్ గా ఆలోచిస్తున్న తిరుపతి యువత ని ద్రుష్టి లో పెట్టుకొని..పెట్టిన పేరు "CREATIVE TIRUPATI"
ఇందులో నేను చేసే ప్రతి పోస్ట్ వ్యక్తిగత ప్రచారానికి కాకుండా...ఎవరి మొహాల్లోనూ నవ్వు నా పోస్ట్ ల వాళ్ళ చెదిరి పోకుండా..ఒకర్ని సన్నంగా-ఇంకోర్ని లావు గా చెప్పకుండా...పోస్ట్ లు చేసిన ప్రతి సారి like?..share?..comment? అని మీ చాట్ బాక్స్ ని కొట్టకుండా...ఎండలో తిరిగొచ్చిన వారికి అముల్ ఐస్ క్రీం లా....బాధ లో ఉన్నోడికి బీరు లా..
మన రోడ్ల మీదున్న దుమ్ము పడి మూసుకుపోయిన మొహాల నుండి నవ్వు ని తీసే ప్రయత్నం చేస్తాననే నమ్మకం తో....
సహాయంతో కూడిన అభినందనలు...విమర్శలతో కూడిన ప్రోత్సాహాలు ఎప్పటికి నాకందిస్తారని ఆశిస్తూ.....
...............మీ మహంతి నాగార్జున
2 Komentar
Prasa bagundi, Writer ah?
Balasyes :)
Balas